చాట్‌‌ జీపీటీకి పోటీగా..భారత్‌‌ జీపీటీ

చాట్‌‌ జీపీటీకి పోటీగా..భారత్‌‌ జీపీటీ
  • డెవలప్ చేసిన రిలయన్స్‌‌, ఐఐటీలు, ప్రభుత్వం
  • వచ్చే నెలలో లాంచ్ చేసే అవకాశం
  • ఏఐ మోడల్ పేరు ‘హనుమాన్’!

న్యూఢిల్లీ: చాట్‌‌జీపీటీ లాంటి ఏఐ మోడల్‌‌ను ఇండియా కూడా డెవలప్ చేసింది.  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, దేశంలోని టాప్ ఇంజినీరింగ్ స్కూల్స్‌‌ కలిసి భారత్‌‌ జీపీటీని డెవలప్ చేశాయి.  వచ్చే నెలలో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. దేశ ఆర్టిఫీషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ (ఏఐ) సెక్టార్‌‌‌‌లో ఇదో పెద్ద ముందడుగు కానుంది. ఈ కన్సార్టియంలో రిలయన్స్ జియోతో పాటు ఎనిమిది అఫిలియేటెడ్‌‌ యూనివర్సిటీలు ఉన్నాయి.

ముంబైలో జరిగిన ఓ టెక్ కాన్ఫరెన్స్‌‌లో భారత్ జీపీటీకి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో సౌత్ ఇండియాలోని   ఓ మోటర్‌‌‌‌ సైకిల్ మెకానిక్‌‌ తమిళంలో ఏఐ బాట్‌‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాడు. అలానే ఓ బ్యాంకర్‌‌‌‌ ఈ బాట్‌‌ సాయంతో హిందీలో మాట్లాడుతుంటాడు. హైదరాబాద్‌‌లోని  ఓ డెవలపర్ కంప్యూటర్ కోడ్‌‌ రాయడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.

భారత్‌‌ జీపీటీని ‘హనుమాన్‌‌’ పేరుతో తీసుకొచ్చే అవకాశం ఉంది. భారత్ జీపీటీ హెల్త్‌‌కేర్‌‌‌‌, గవర్నెన్స్‌‌, ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌, ఎడ్యుకేషన్‌‌ సెక్టార్లలో  మొత్తం 11 లాంగ్వేజ్‌‌లలో పనిచేయగలదు.  ప్రభుత్వ మద్దతుతో  ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలు, జియో ఇన్ఫోకామ్‌‌ ఈ మోడల్‌‌ను డెవలప్ చేశాయి. 

ఇండియా కోసం ఏఐ యాప్‌‌లు.. 

 చాలా స్టార్టప్‌‌ కంపెనీలు ఇండియన్ల కోసం ఏఐ యాప్‌‌లను తీసుకొస్తున్నాయి. సర్వం, కృత్రిమ్‌‌ వంటి స్టార్టప్ కంపెనీలు లైట్‌‌స్పీడ్‌‌ వెంచర్‌‌‌‌ పార్టనర్స్‌‌, బిలియనీర్‌‌‌‌ వినోద్‌‌ ఖోస్లే ఫండ్‌‌ నుంచి పెట్టుబడులు ఆకర్షించగలిగాయి.  చాట్‌‌జీపీటీ డెవలప్ చేసిన ఓపెన్‌‌ ఏఐ లాంటి కంపెనీలు పెద్ద సైజ్‌‌లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌‌ (ఎల్‌‌ఎల్‌‌ఎం) ను  డెవలప్‌‌ చేస్తున్నాయి.

హనుమాన్  డిఫరెంట్‌‌ అని  ఐఐటీ బాంబే ప్రొఫెషర్  గణేష్‌‌ రామకృష్ణన్‌‌ అన్నారు.  స్పీచ్‌‌ టు టెక్స్ట్‌‌ సర్వీస్‌‌లు కూడా ఇది అందిస్తుందని, యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పారు. కొన్ని పనుల  కోసం కస్టమైజ్డ్ మోడల్‌‌ను రిలయన్స్ జియో డెవలప్ చేస్తుందని అన్నారు. యూజర్ల కోసం ఏఐ ప్లాట్‌‌ఫామ్‌‌ జియో బ్రెయిన్‌‌ను తీసుకు రావాలని చూస్తోందని చెప్పారు. కాగా,  జియో కస్టమర్ల సంఖ్య 45 కోట్లు. ఏఐ సెక్టార్‌‌‌‌లో  భారత్‌‌ జీపీటీ మొదటి ప్రైవేట్‌‌, పబ్లిక్ ప్రాజెక్ట్‌‌.