రాహుల్ యాత్ర రాజస్థాన్‌‌‌‌లో సక్సెస్ అవుతుంది: పైలట్​

 రాహుల్ యాత్ర రాజస్థాన్‌‌‌‌లో సక్సెస్ అవుతుంది: పైలట్​

జైపూర్: రాజస్థాన్‌‌‌‌లో భారత్ జోడో యాత్ర సక్సెస్ అవుతుందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వెల్లడించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకుంటామని గుర్జార్ నేత విజయ్ బైంస్లా ప్రకటించిన నేపథ్యంలో సచిన్ పైలట్ బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్‌‌‌‌లో భారత్ జోడో యాత్ర కోసం జరుగుతున్న సన్నాహకాలను ఆయన వివరించారు. యాత్రను అపూర్వంగా స్వాగతించేందుకు రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని సచిన్ పైలట్ వెల్లడించారు. 

భారత్ జోడో యాత్ర రాజకీయం కోసం కాదని.. దేశంలోని ప్రజలను ఏకం చేయడానికని తెలిపారు. రాష్ట్రానికి రాహుల్ రావాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. రాజస్థాన్ నుంచే కాంగ్రెస్‌‌‌‌కు కొత్త ప్రారంభం లభిస్తుందని చెప్పారు. పాదయాత్ర డిసెంబర్ 3 నుంచి 6 మధ్య రాజస్థాన్‌‌‌‌లోకి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. 15 నుంచి-18 రోజుల పాటు జరగనున్న రాహుల్ యాత్ర.. అల్వార్‌‌‌‌లో ముగుస్తుందని చెప్పారు.