తెలంగాణలో మరో కొత్త పార్టీ... అన్ని సీట్లలో పోటీ

తెలంగాణలో మరో కొత్త పార్టీ...  అన్ని సీట్లలో పోటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటయింది. ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రాంచంద్రయాదవ్ ‘భారత చైతన్య యువజన’ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం వెల్లడించారు. 

ఇటీవల ఎన్నికల సంఘం తమ పార్టీకి చెరుకు రైతు గుర్తును కేటాయించినట్లు ప్రకటించారు. జూబ్లిహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో రాంచంద్రయాదవ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 1న అభ్యర్థులను, మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.