చంద్రయాన్ పాటపై భరతనాట్యం..చంద్రయాన్ 3 సురక్షితంగా ల్యాండింగ్ కోసం

చంద్రయాన్ పాటపై భరతనాట్యం..చంద్రయాన్ 3 సురక్షితంగా ల్యాండింగ్ కోసం

మరికొద్ది గంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్3 సాఫ్ట్ ల్యాండింగ్కు సిద్ధమైంది. సాయంంత్రం 5.47 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 6.04 గంటలకు ఆర్టిట్ నుంచి ల్యాండర్ విడిపోయి జాబిల్లిపై దిగనుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగాలంటూ దేశ వ్యాప్తంగా ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. అయితే ఓ భరతనాట్యం డ్యాన్సర్ ..వినూత్నంగా కూచిపూడి, భరత నాట్యం ప్రదర్శించింది. 

చంద్రయాన్ 3 సురక్షితంగా ల్యాండ్ అవ్వాలని ప్రార్థిస్తూ..భరతనాట్యం, కూచిపూడి నృత్యకారిణి పూజా హిర్వాడే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నృత్య ప్రదర్శన చేశారు. 'నమో నమో భారతాంబే', చంద్రయాన్ పాటలపై భరతనాట్యం ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది..

భరతనాట్యం, కూచిపూడి నృత్యకారిణి పూజా హిర్వాడే మాట్లాడుతూ,  చంద్రయాన్-3 ఆగస్టు 23వ తేదీన  చంద్రునిపై ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉంది.  కాబట్టి ఈ క్షణానికి గుర్తుగా, నేను చంద్రయాన్ గీతంపై భరతనాట్యం ప్రదర్శించాను. ఇది మొత్తం భారతదేశానికి గర్వించదగిన, చారిత్రాత్మక రోజు.  చంద్రయాన్ 3లో భాగస్వాములైన  శాస్త్రవేత్తలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను."