
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ లో బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేసింది. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేసింది. కలెక్టరేట్ ను ముట్టడించేందుకు యత్నించిన బీజేపీ యువమోర్చా నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
బారికేడ్లు తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఇటీవల ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచింది. దీనిపై బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.