శరవేగంగా భారతీయుడు మూవీ షూటింగ్

 శరవేగంగా భారతీయుడు మూవీ షూటింగ్

గతేడాది ‘విక్రమ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌‌‌‌ను అందుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్2’ మూవీపై ఫోకస్ పెట్టారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న  ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఏపీలోని కడప జిల్లాలో కొంత భాగం, తర్వాత ఆఫ్రికాలో మరికొంత షూట్ చేసిన టీమ్.. శనివారం తైవాన్‌‌‌‌కు చేరుకున్నారు. అక్కడ నాలుగు రోజుల పాటు  షూటింగ్ జరగనుందని, అనంతరం మళ్ళీ ఆఫ్రికాలోని జోహాన్స్ బర్గ్‌‌‌‌లో లాంగ్ షెడ్యూల్ ఉందని తెలియజేశారు మేకర్స్.

ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తికాగా, బ్యాలెన్స్ పార్ట్‌‌‌‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా  ప్లాన్ చేసుకున్నారు శంకర్.  కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరణ్‌‌‌‌తో కలిసి ఉదయనిధి స్టాలిన్‌‌‌‌ నిర్మిస్తున్నారు.  మరోవైపు రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ చేంజర్‌‌‌‌‌‌‌‌’ చిత్రాన్ని రూపొందిస్తున్న శంకర్.. ఈ  చిత్రాన్ని డిసెంబర్ లాస్ట్ వీక్ లేదా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలా జరిగితే.. ‘ఇండియన్2’ను వచ్చే ఏడాది సమ్మర్‌‌‌‌‌‌‌‌లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.