ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వీర్నపల్లి, వెలుగు : టీఆర్ఎస్​పాలనలో ప్రజల బాధలు తీర్చేందుకే బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తోందని పార్టీ స్టేట్ సెక్రటరీ కె. మాధవి అన్నారు. ఆదివారం వీర్నపల్లి మండలకేంద్రంలో మండల నాయకులతో కలిసి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా టీఆర్‌‌‌‌ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అంతకుముందు పార్టీ మండలాధ్యక్షుడు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు జెండా ఆవిష్కరించి కంచర్ల నుంచి శాంతినగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, సిరిసిల్ల అసెంబ్లీ ఇన్​చార్జి మోహన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, రాజు తదితరులు ఉన్నారు.  

అనుమతి ఉన్న ఇండ్లను కూలగొడితే ఊరుకోం

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ నిబంధనలప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని, అనుమతి ఉన్న ఇండ్లను కూలగొడితే ఊరుకోబోమని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక కలెక్టర్ బంగ్లా ఎదుట నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడి కొన్న స్థలంలో చట్టపరంగా అనుమతులు తీసుకుని నివసిస్తున్న ఓనర్లకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కరీంనగర్ ను తెలంగాణలోనే గొప్ప నగరంగా మార్చుకుందామని చెప్పారు. రోడ్లపై పందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో డీఈ మసూద్ అలి, కార్పొరేటర్లు, లీడర్లు పాల్గొన్నారు.

మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు

మండలంలోని మల్లన్నపేటలో ఆదివారం జరిగిన మల్లికార్జున స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. స్కూళ్లకు, ఆఫీస్ లకు సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సి వచ్చింది. బోనాలు, బంగారం తులాభారం, మల్లన్న పట్నాలు వేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడే వంటలు చేసుకొని బోనం సమర్పించుకున్నారు. సమారు 40 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ విక్రం, శాంతయ్య తెలిపారు.

 - గొల్లపల్లి, వెలుగు 

‘సంగ్రామ యాత్రను సక్సెస్ చేయాలి’ 

మెట్ పల్లి, వెలుగు: బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ జగిత్యాలలో చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్ర ను విజయవంతం చేయాలని సంగ్రామ యాత్ర రాష్ట్ర సహ ఇన్​చార్జి తుళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం మెట్ పల్లిలో నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర సమావేశంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ సత్యనారాయణ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్రకు భారీ స్పందన వస్తోందన్నారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు సూచనలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్​చార్జి శేఖర్, జిల్లా యాత్ర ప్రముఖ్​మధుకర్, మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అయ్యప్ప మెట్ల పూజ

మెట్ పల్లి, వెలుగు: పటణంలోని కళానగర్ లో ఆదివారం అయ్యప్ప స్వామి మెట్ల పూజ వైభవంగా నిర్వహించారు. గురుస్వామి కాశేట్టి రవికుమార్ గణపతి, సుబ్రహ్మణ్యం, కలశ, శంకు, గంట, ధ్వజస్తంభ పూజలు నిర్వహించి స్వామికి పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం 18 మేట్లపై కర్పూర హరతి వెలిగించి పంచాహారతులు సమర్పించారు. కార్యక్రమంలో స్వాములు సంజివ్, రవి, యాదగిరి, అమృత్ లాల్, మల్లేష్, రమణ, రమేశ్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ లో..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని పోలీస్ స్టేషన్  క్వార్టర్స్ లో ఎస్సై శేఖర్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప శరణుఘోషతో పోలీస్ స్టేషన్ ఆవరణ మార్మోగింది. మహా పడిపూజ అనంతరం స్వాములకు, భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఐ మొగిలి, ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండలాల అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు.

జమ్మికుంటలో ఈషా రెబ్బా సందడి

జమ్మికుంట, వెలుగు: ప్రముఖ సినీ నటి ఈషా రెబ్బా ఆదివారం జమ్మికుంట పట్టణంలోని కాసం ఫ్యాషన్స్​బట్టల దుకాణాన్ని ప్రారంభించారు. పట్టణంతోపాటు పరిసర ప్రాంత ప్రజలకు వస్ర్త సముదాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి బట్టల దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ టి.రాజేశ్వర్​రావు, నిర్వాహకులు రఘు, టీఆర్ఎస్ నేత దేశిని కోటితో తదితరులు పాల్గొన్నారు. ​