నా అద్దం అంటే నువ్వే.. రవితేజ, డింపుల్ హయాతీ సెకండ్ సాంగ్ రిలీజ్ అప్పుడే..

నా అద్దం  అంటే నువ్వే..  రవితేజ, డింపుల్ హయాతీ సెకండ్ సాంగ్ రిలీజ్ అప్పుడే..

రవితేజ, డింపుల్ హయతి జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం   ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ‘అద్దం ముందు’ అంటూ సాగే పాటను డిసెంబర్ 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

సోమవారం ఈ పాటకు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ‘అద్దం ముందు నిలబడి.. అబద్దం చెప్పలేనే.. నా అద్దం అంటే నువ్వే మరి.. ఈ నిజం దాచలేనే..’ అంటూ సాగిన ప్రోమో ఆకట్టుకుంది.  రవితేజ, డింపుల్ హయతిపై చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్ ప్లెజెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి. వీరిమధ్య కెమిస్ట్రీ ఇంప్రెస్ చేయగా, ఫుల్ సాంగ్‌‌‌‌‌‌‌‌పై ఆసక్తిని పెంచింది.  

ఈ మెలోడీ డ్యూయెట్‌‌‌‌‌‌‌‌ను  భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ కలిసి పాడారు.  ఈ చిత్రంలో మరో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా ఆషికా రంగనాథ్ నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నారు.