Airtel prepaid : భారీగా ధరలు పెంచిన ఎయిర్‌‌టెల్‌

Airtel prepaid : భారీగా ధరలు పెంచిన ఎయిర్‌‌టెల్‌

భారతి ఎయిర్‌‌టెల్.. ప్రీపెయిడ్ యూజర్లకు షాకిచ్చింది. బేసిక్ ప్లాన్ ధరను ఏకంగా 57శాతం పెంచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఈశాన్య రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ సర్కిళ్లలో కొత్తరేట్లు అమల్లోకి రానున్నాయి. ప్లాన్ ధరల పెంపునకు కారణాలను కంపెనీ ప్రకటించలేదు.

గతంలో రూ. 99 నెలవారీ రీచార్జ్ ప్లాన్‌ లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీ, 200ఎంబీ డేటా ఇచ్చేది. తాజాగా ఈ  రీఛార్జ్ ప్లాన్ ధరను రూ.155కు పెంచిన ఎయిర్ టెల్ 28 రోజుల వ్యాలిడిటీ, ఒక జీబీ డేటా ఇవ్వనున్నట్లు చెప్పింది. మిగతా ప్లాన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, కొన్ని ఫోన్ నెంబర్లకు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులే చూపిస్తుండటంతో కస్టమర్లు గందరగోళానికి గురవుతున్నారు.