భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ లాభం రూ. 4,160 కోట్లు

భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ లాభం రూ. 4,160 కోట్లు

న్యూఢిల్లీ : టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ జూన్ 30, 2024తో ముగిసిన మొదటి క్వార్టర్​లో కన్సాలిడేటెడ్​ లాభం 2.5 రెట్లు పెరిగి రూ. 4,160 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1,612.5 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం  గత ఏడాది జూన్ క్వార్టర్​లో రూ. 37,440 కోట్లు కాగా, ఈ క్వార్టర్​లో 2.8 శాతం పెరిగి రూ.38,506.4 కోట్లకు చేరుకుంది.  

భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ భారతదేశ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10.1 శాతం పెరిగి రూ.29,046 కోట్లకు చేరుకుంది.  టెలికాం ఆపరేటర్ల వృద్ధిని కొలిచే ‘ప్రతి వినియోగదారు నుంచి సగటు ఆదాయం’ (ఏఆర్​పీయూ) వార్షికంగా రూ.200 నుంచి రూ.211లకు పెరిగింది.