లోకసభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్‌ ప్రమాణ స్వీకారం

లోకసభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్‌ ప్రమాణ స్వీకారం

18వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ సీనియర్ నేత భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1) ప్రకారం ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేశారు.  లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల (ఎంపీలు) చేత ఈయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.  

భర్తృహరి మహతాబ్‌ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.  8 సెప్టెంబర్ 1957న జన్మించారు. ఈయన 1998 నుండి 2019 వరకు కటక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా ఆరుసార్లు ఎన్నికయ్యారు.  ఒడిశా మాజీ ముఖ్యమంత్రి,  దివంగత హరే కృష్ణ మహతాబ్ కుమారుడే ఈ భర్తృహరి మహతాబ్.  

2024 మార్చి 22న బీజేడీ పార్టీకి రాజీనామా చేసిన నేత భర్తృహరి మహతాబ్  బీజేపీలో చేరారు.   2014 నుండి 2019 వరకు లోక్‌సభలో బీజేడీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసి పార్లమెంటు చర్చలలో అతని అత్యుత్తమ పనితీరుకుగాను 2017 నుండి 2020 వరకు వరుసగా 'సంసద్ రత్న' అవార్డును అందుకున్నారు. కాగా  కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు భత్రిహరి మహతాబ్ అన్ని బాధ్యతలను నిర్వహిస్తారు.