ఐఏఎస్కు ఒకే చెప్పిన భవ్య భిష్ణోయ్‌.. పాపం మెహ్రీన్‌

 ఐఏఎస్కు ఒకే చెప్పిన భవ్య భిష్ణోయ్‌.. పాపం మెహ్రీన్‌

టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్‌ ప్రస్తుతం కెరీర్ పరంగా చాలా డౌన్ లో ఉంది. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఆమె తెలుగులో చివరగా నటించిన సినిమాలు F3, మంచి రోజులు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసాయి. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఒక్క కొత్త సినిమాకి కూడా సైన్ చేయలేదు ఈ బ్యూటీ.

పోనీ తన పర్సనల్ లైఫ్ అయిన బాగుందా అంటే అదీలేదు. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో ఆమె పెళ్లి రద్దు అయిన సంగతి తెలిసిందే. 2021 మార్చిలో మెహ్రీన్‌, భవ్య భిష్ణోయ్‌ నిశ్చితార్థం జైపూర్‌‌లో ఘనంగా జరిగింది. అయితే.. ఏమైందో ఏమో తెలియదు కానీ ఎంగేజ్‌మెంట్‌ అయిన కొద్దిరోజులేక ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా మారారు.

మెహ్రీన్‌ హీరోయిన్‌గా కంటిన్యూ చేస్తుంటే, 2022లో జరిగిన బైపోల్‌ ఎలక్షన్స్‌లో బీజేపీ తరపున పోటీ చేసిన భవ్య భిష్ణోయ్‌ ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఐఏఎస్‌ ఆఫీసర్‌ పరి భిష్ణోయ్‌తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు భవ్య భిష్ణోయ్‌. రీసెంట్‌గా హర్యానాలో ఘనంగా వీరి నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.