ఓటీటీలో భీమ్లా నాయక్

ఓటీటీలో భీమ్లా నాయక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులలో ఈ విషయం కచ్చితంగా జోష్ నింపుతుంది. ఆయన హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‎గా రూపుదిద్దుకున్న ఈ సినిమా.. ఆత్మ గౌరవానికి అహంకారానికి మధ్య నడిచే పోరుగా తెరకెక్కింది. ఈ మూవీ గత నెల ఫిబ్రవరి 25న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. 

ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలచేయబోతున్నారు. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‎ను హాట్ స్టార్ డిస్నీతో పాటు ఆహా కూడా సొంతం చేసుకుంది. భీమ్లా నాయక్‎ను శుక్రవారం మార్చి 25న విడుదలచేస్తున్నట్లు ఆహా ప్రకటించింది. గతేడాది వచ్చిన వకీల్ సాబ్ సినిమాను కూడా విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను కూడా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీ బాట పట్టిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‎మెంట్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. రానా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందించారు.

For More News..

ఏటీఎం కార్డు పెడితే గోల్డ్ బయటికొస్తది!

హోలీ అంటే  రాధ.. హోలీ అంటే కృష్ణుడు...