
హైదరాబాద్, వెలుగు: ఏటీఎం కార్డు పెడితే గోల్డ్ బయటకొచ్చేయాలి! విన్నది కరెక్ట్‌గానే. గోల్డ్‌సిక్కా కంపెనీ త్వరలో గోల్డ్ ఏటీఎంలను తీసుకొస్తామని ప్రకటించింది. మూడు ప్రోటోటైప్ ఏటీఎంలను అబిడ్స్, సికింద్రాబాద్, ఓల్డ్‌సిటీలలో ఏర్పాటు చేస్తామని పేర్కొంది. కస్టమర్ తమ ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డులను వాడి ఈ ఏటీఎంల నుంచి బంగారం కొనుక్కోవచ్చు. కనీసం అర గ్రాము నుంచి 100 గ్రాముల వరకు గోల్డ్‌ను కొనొచ్చు. హైదరాబాద్‌లో పెట్టే ప్రోటోటైప్‌లు సక్సెస్ అయితే దేశం మొత్తం మీద మరో 3 వేల గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. రూరల్ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా ఏర్పాటు చేస్తామంది.