నాడు చంద్రబాబు, నేడు జగన్​.. భోగాపురం ఎయిర్​ పోర్టుకు  శంకుస్థాపన

నాడు చంద్రబాబు, నేడు జగన్​.. భోగాపురం ఎయిర్​ పోర్టుకు  శంకుస్థాపన

భోగాపురం ఎయిర్ పోర్టును ఏపీ సీఎం జగన్ ఈ రోజు ( మే3)న ప్రారంభించారు. 2026లో మళ్లీ తానే సీఎం అవుతానని.. జాతికి అంకితం చేస్తానని ప్రకటించారు. సీఎం జగన్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత చంద్రబాబు  ఖండించారు. ఆ ఎయిర్ పోర్టును ఐదేళ్ల క్రితమే  ప్రారంభించామని గుర్తుచేశారు. సొంత ప్రచారం కోసం జగన్ ఇలా చేస్తున్నారని విమర్శించారు.

ప్రజాధనం భారీగా ఖర్చు

ఎయిర్ పోర్టు ప్రారంభం పేరుతో పత్రికలకు  ఫుల్ పేజీ యాడ్  ఇచ్చారని.. దీంతో ప్రజా ధనం భారీగా ఖర్చు చేశారని మండిపడ్డారు. హిందూజా, అమూల్‌కు వేల కోట్ల ప్రభుత్వం ధనం ధారాదత్తం చేస్తున్నారని.. దీంతో భారీగా కమీషన్లు దండుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్  చేసే జిమ్మిక్కులను జనం నమ్మే స్థితిలో లేరని చెప్పారు.

నాడు బాబు.. నేడు జగన్​ 

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్రారంభించిన వాటిని మ‌ళ్లీ ప్రారంభించ‌డం, శంకుస్థాప‌న చేసిన వాటికి మ‌ళ్లీ శంకుస్థాప‌నలు జరిగాయి. ఆ జాబితాలో ఇప్పుడు భోగాపురం ఎయిర్ పోర్ట్  చేరింది. ఇదే ఎయిర్ పోర్ట్ కు 2019 ఫిబ్ర‌వ‌రి 15న చంద్ర‌బాబు శంకుస్థాప‌న చేశారు. అదే రోజు ఆదానీ డేటా సెంట‌ర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ హ‌బ్ త‌దిత‌రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కానీ, మ‌ళ్లీ ఇప్పుడు వాటికే భూమి పూజ చేయ‌డం చర్చనీయాంశంగా మారింది.