నా భర్త ఆమెతో వెళ్లడం భరించలేకపోతున్నా.. స్టార్ హీరో భార్య కన్నీటి గాథ!

నా భర్త ఆమెతో వెళ్లడం భరించలేకపోతున్నా.. స్టార్ హీరో భార్య కన్నీటి గాథ!

భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో 'పవర్ స్టార్'గా, ప్రముఖ రాజకీయ నేతగా వెలుగొందుతున్న పవన్ సింగ్ వ్యక్తిగత జీవితం మరోసారి పెను తుఫాన్‌లా మారింది. ఆయన రెండో భార్య జ్యోతి సింగ్ లేటెస్ట్ గా సంచలన ఆరోపణలు చేసింది. సోషల్ మీడియా వేదికగా కన్నీటి పర్యంతమైంది.  తన భర్త తనను ఇంటి నుంచి గెంటేసి, అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోలీసులను పిలిపించి భార్యపైనే ఎఫ్ఐఆర్?

భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్‌తో విభేదాల కారణంగా గత కొంత కాలంగా జ్యోతి సింగ్ దూరంగా ఉంటుంది. అయితే ఇటీవల ఆమె తన భర్త ఇంటికి వెళ్లగా అక్కడ చేదు అనుభవం ఎదురైంది. తనను బలవంతంగా బయటకు పంపేందుకు పవన్ సింగ్ ఏకంగా పోలీసులను పిలిపించడమే కాకుండా, తనపై ఎఫ్ఐఆర్ (FIR) కూడా దాఖలు చేయించాడని జ్యోతి సింగ్ ఆరోపించింది. తాను భర్త ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చిందని, ఇప్పుడు పోలీసులు తనను తీసుకెళ్లడానికి వస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. భార్యను బయటకు గెంటేయాలని పోలీసులను పిలిపించుకున్న పవన్ సింగ్ సమాజానికి సేవ చేస్తాడా? ఎన్నికలు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి నా పేరును వాడుకుంటాడు. అవి అయిపోయిన వెంటనే వేరే అమ్మాయితో హోటల్‌కు వెళ్తాడు అని జ్యోతి సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది.

అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వేధింపులు

తన కళ్ల ముందే పవన్ సింగ్ మరొక అమ్మాయితో హోటల్‌కు వెళ్లడం చూసి కూడా ఎవరూ అతన్ని ప్రశ్నించరని జ్యోతి సింగ్ వాపోయింది. భర్త వేరే అమ్మాయితో ఉండటం భార్యగా నేను భరించలేకపోయాను. అందుకే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను అని ఆమె వెల్లడించింది. తన భర్త తప్పులను ప్రశ్నించినందుకు తానే ఈ వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె ఆరోపించింది.

వివాదాల వలయంలో పవన్ సింగ్

పవన్ సింగ్ గతంలో (2014లో) ప్రియకుమారి సింగ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లైన కేవలం ఆరు నెలలకే ఆమె ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పవన్ సింగ్, 2018లో జ్యోతి సింగ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లైన కొద్ది రోజులకే జ్యోతి సింగ్ తనపై గృహ హింస (Domestic Violence) , గర్భస్రావానికి (Forcing for Abortion) ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ కోర్టులో కేసు దాఖలు చేసింది. అప్పటి నుంచి వీరిద్దరూ విడాకుల కేసుతో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.

ఇటీవల పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి రాఘవ్‌ను స్టేజీపై అసభ్యకరంగా తాకిన వివాదంతో వార్తల్లో నిలిచారు. పవన్ సింగ్ వేధింపుల కారణంగానే భోజ్‌పురి నటి అక్షర సింగ్ కూడా పరిశ్రమను వదిలి వెళ్లినట్లు గతంలో ఆరోపణలు ఉన్నాయి.

రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పవన్ సింగ్‌పై భార్య చేసిన ఈ తీవ్ర ఆరోపణలు ఆయన ప్రతిష్టను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. విడాకుల విషయంలో పవన్ సింగ్ కోర్టులో ఇంటితో పాటు పిల్లల ఖర్చులను భరిస్తానని చెప్పినా, జ్యోతి సింగ్ కేసును కొనసాగించడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మొత్తం మీద, భోజ్‌పురి పవర్ స్టార్ వ్యక్తిగత వివాదం ఇటు సినీ పరిశ్రమలో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.