
బిగ్‌బాస్ సీజన్ 7(Bigg boss season7) గ్రాండ్ ఫినాలే రోజు పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యాడు పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth). ఆ కారణంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ నిమిత్తం చంచల్ గూడా జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనియ్యాంశం అయ్యింది. ఇక తాజాగా ప్రశాంత్‌ను అరెస్ట్ అవడంపావు పాట బిడ్డ, బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ భోలె షావళి స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. పల్లవి ప్రశాంత్ ఒక రైతుబిడ్డ, భూమి బిడ్డ. బిగ్ బాస్ హౌస్ లో ఎంతో పోరాటం చేసి, టాస్కులు ఆడి, ఎన్నో దెబ్బలు తగిలించుకుని విన్నర్ గా నిలిచాడు. నేను హౌస్ లో ఉన్నప్పుడు చూశాను కదా.. అతను చాలా అమాయకుడు. నాతో అన్నా అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. నువ్వు గెలవాలి తమ్ముడు, నేను బయట పాటతో బతుకుతాను కానీ.. నువ్వు ఆటతోనే బతకాలి. అందుకే నువ్వు ఖచ్చితంగా గెలవాలి అని చెప్పాను. చివరకు నా పాట, ఆయన ఆట.. రెండు జైలుపాలయ్యాయి. పల్లవి ప్రశాంత్ ను అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. జనమంతా స్పందించి ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లండి.
నిజం చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో కూడా ప్రశాంత్‌కు తెలియదు. ఎదో గెలిచాననే ఆనందంలో తెలియక చేశాడే తప్పా.. అతనేం నేరం చేయలేదు. తనవల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురైతే పోలీసులకు నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు భోలె షావళి. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.