Bhoothaddam Bhaskar Narayana Movie Review: దిష్టిబొమ్మల థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Bhoothaddam Bhaskar Narayana Movie Review: దిష్టిబొమ్మల థ్రిల్లర్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భూతద్ధం భాస్కర్ నారాయణ. దర్శకుడు పురుషోత్తం రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత ప్రధాన పాత్రల్లో కనిపించారు. టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(మార్చ్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? థిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

కథ:
ఈ సినిమా కథ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఓ సైకో కిల్లర్‌ మహిళల్ని హత్య చేసి వారి తలల స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ హత్యలు సంచలంగా మారుతాయి. ఆ సైకో కిల్లర్ ను పట్టుకోవడం పోలీసులకి పడ్డ సవాల్‌గా మారుతుంది. దాంతో ఈ కేసును ఛేదించడానికి డిటెక్టివ్‌ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. మరి ఆ సీరియల్ కిల్లర్ కేసును భాస్కర్ నారాయణ ఎలా ఛేదించాడు? ఆ సీరియల్ కిల్లర్ మోటీవ్ ఏంటి? మహిళలను ఎందుకు చంపుతున్నాడు? వాటికి దిష్టి బొమ్మలకు ఉన్న లింక్ ఏంటి? ఈ కేసుతో పురాణాలకి ఉన్న లింకేంటి? అనేదే భూతద్ధం భాస్కర్ నారాయణ మిగతా కథ.

విశ్లేషణ:
ప్రస్తుతం థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేటివ్ కథలకు మంచి డిమాండ్ ఉంది. ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరిగ్గా అలాంటి కథతో వచ్చిన సినిమానే భూతద్ధం భాస్కర్ నారాయణ. క్రైమ్ థ్రిల్లర్ కథకి పురాణాలకి, దిష్టిబొమ్మలకి లింక్ చేసి అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేక్షకులకు కూడా ఒక కొత్త కాన్సెప్ట్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. 

నిజానికి ఇలాంటి సినిమాలకి ఇన్వెస్టిగేషన్ అనేది సన్స్పెన్స్ గా సాగాలి. ఆ విషయంలో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రతీ సీన్ తరువాత ఎం జరుగుతుంది అనే ఆసక్తిని కలిగిస్తుంది. సినిమా మొదలు కాస్త స్లోగా  అనిపించినా.. కిల్లర్ ఎంటర్ అయ్యాక కథ పరుగులు పెడుతుంది. హత్యలు, ఇన్వెస్టిగేషన్, ఒక్క క్లూ దొరకకపోవడం, దిష్టిబొమ్మలు, పురాణాలతో లింక్ ఇలా ప్రతీ సీన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయి. ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు మరింత ఆకట్టకుంటాయి. ఇక అదే సస్పెన్స్ తో వచ్చే క్లిమక్స్, క్లిమక్స్ లో ఒక్కొక్క పాయింట్ ను ఎక్స్ప్లయిన్ చేసిన విధానం సూపర్ గా వర్కౌట్ అయ్యింది. 

నటీనటులు:
భాస్కర్ నారాయణ పాత్రకు శివ కందుకూరి హండ్రెడ్ ప్రసెంట్ న్యాయం చేశాడు. కొత్తగా కనిపించడమే కాకుండా.. తన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుకున్నాడు. డిటెక్టివ్ పాత్రకు కావాల్సిన ఇంటెన్స్ ను మైంటైన్ చేస్తూ అలరించాడు. రిపోర్టర్ లక్ష్మీ గా రాశీ సింగ్‌ కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన పాత్రల్లో కనిపించిన దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత కూడా తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు. 

సాంకేతిక వర్గం:
భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాను మెయిన్ హైలెట్ అంటే శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. తన అద్భుతమైన బీజీఎమ్ తో సినిమాకు ప్రాణం పోశాడు. సస్పెన్స్ సినిమాకి కావాల్సిన మూడ్ ను మైంటైన్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక గౌతమ్ జార్జ్ కెమరాపనితనం బాగుంది. విఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. 

ఇక భూతద్ధం భాస్కర్ నారాయణ. సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి.