
అర్జున్ కపూర్ హీరోగా ‘ద లేడీ కిల్లర్’ అనే మూవీ అనౌన్స్మెంట్ పోయినేడు అక్టోబర్‌లో వచ్చింది. ఇప్పుడీ చిత్రంలో హీరోయిన్‌గా భూమి పెడ్నేకర్‌ని తీసుకున్నారు. అజయ్ బెహల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. భూషణ్ కుమార్, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. పల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన ఓ యువకుడు ఒకమ్మాయి ప్రేమలో పడతాడు. దానివల్ల అతని జీవితం పూర్తిగా తారుమారైపోతుంది. అప్పుడతను ఏం చేశాడనేది కథ. ఇది హత్యలు చేసే అమ్మాయి కథా, లేక అమ్మాయిల్ని హత్య చేసే యువకుడి కథా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు మేకర్స్.