జయశంకర్ భూపాలపల్లి: సకాలంలో సర్వే పూర్తి చేయాలి

 జయశంకర్ భూపాలపల్లి: సకాలంలో సర్వే పూర్తి చేయాలి
  •     కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ఏళ్ల తరబడి పెండింగ్‌‌‌‌లో ఉన్న బల్క్ భూములు, సాదా బైనామా సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌‌‌‌లో ఉన్న బల్క్ భూ సమస్యలు, సాదా బైనామా కేసులు, ప్రజల నుంచి వచ్చిన వినతులపై వివరంగా చర్చించారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులకు భూ హక్కు పత్రాలు జారీ చేసేందుకు బల్క్ భూముల సర్వే కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. 

సర్వే ప్రక్రియలో వేగం పెంచి నివేదికలను త్వరగా అందజేయాలని ఆదేశించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, శాఖల మధ్య సమన్వయం పెంచి సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు.  సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్వో వసంతకుమారి, భూపాలపల్లి, కాటారం డివిజన్ ఆర్డీవోలు హరికృష్ణ, రవీందర్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.