రోడ్లు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

 రోడ్లు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

శాయంపేట, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల, కాట్రపల్లి గ్రామాల్లో రూ.1044 లక్షలతో రోడ్డు, బ్రిడ్జి నిర్మాణాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని యూరియా పంపిణీ విషయంలో కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే బీఆర్ఎస్ నాయకులు పగటివేశాలు వేస్తూ ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు.

 ఆ పార్టీ నాయకులు యూరియాపై చేస్తున్న ప్రచారాలను కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, ప్రభుత్వాన్ని బలపర్చాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.