గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు అందజేశారు. తన రాజీనామాను అమోదించాలని గవర్నర్ ను కోరారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం భూపేంద్ర పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 12న భూపేంద్ర పటేల్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలకు గానూ బీజేపీ 156 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ అధికారంలోకి రావడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇక కాంగ్రెస్ కు 17 సీట్లు, ఆప్ కు 5 సీట్లు వచ్చాయి.