వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన ఏకైక బౌలర్ భువనేశ్వర్ కుమార్

వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన ఏకైక బౌలర్ భువనేశ్వర్ కుమార్

నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్వింగ్ కింగ్..భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం మూడు ఓవర్లు వేసిన భువీ..రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీనికి తోడు ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో టీ20ల్లో వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన భారత తొలి బౌలర్గా భువీ చరిత్ర సృష్టించాడు.  మ్యాచ్ మొత్తంలో మూడు ఓవర్లు వేసిన భువీ...9 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. 

బుమ్రా రికార్డు సమం...
ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్..మరో రికార్డును క్రియేట్ చేశాడు. టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన రెండో బౌలర్ గా నిలిచాడు. టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు రికార్డు బుమ్రా పేరిటి ఉంది. అతను 56 టీ20ల్లో 9 మెయిడిన్ ఓవర్లు వేశాడు. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ రికార్డును భువీ సమం చేశాడు. భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు 81 మ్యాచుల్లో 9 మెయిడిన్లు వేశాడు. 

సూపర్ విక్టరీ...
మరోవైపు నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో  టీమిండియా 56 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రోహిత్‌ శర్మ, కోహ్లి , సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్ సెంచరీలు చేయడంతో...20 ఓవర్లలో 2 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఆ తర్వాత 180 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్..భారత బౌలర్ల ధాటికి..20  ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఈ విజయంతో భారత్‌..  గ్రూప్‌-2 టాపర్‌గా నిలిచింది.