కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు.. 14 రోజుల రిమాండ్

కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు.. 14 రోజుల రిమాండ్

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌కు శుక్రవారం ఇక్కడి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

మే 13న సీఎం అధికారిక నివాసంలో కేజ్రీవాల్‌కు వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడని  ఎంపీ మలివాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మే 18న బిభవ్ కుమార్‌ని అరెస్టు చేశారు.  అనంతరం మెజిస్ట్రియల్ కోర్టు ముందు  ప్రవేశపెట్టారు. దీంతో కేజ్రీవాల్ పీఏకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

తన అరెస్టును సవాలు చేస్తూ బిభవ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది. అంతకుముందు మే 27వ తేదీ సోమవారం, కుమార్ బెయిల్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు కొట్టివేసింది.  పోలీసు కస్టడీ ముగియడంతో కుమార్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ను కోరారు. దీంతో మేజస్ట్రేట్ గౌరవ్ గోయల్ బిభవ్ కుమార్ కు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.