అమెరికాలో గన్ కొనుగోలు వయస్సు పెంపు

 అమెరికాలో గన్ కొనుగోలు వయస్సు పెంపు

అమెరికాలో గన్ కొనుగోలు వయసు నిబంధనను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ 18 నుంచి 21 సంవత్సరాలకు పొడగించారు. గత కొన్నిరోజులుగా యథేచ్ఛగా జరుగుతున్న కాల్పులతో అగ్రరాజ్యం అమెరికా ఆందోళన చెందుతుంది. ఓక్లహామా కాల్పుల తర్వాత జో బైడెన్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. త్వరలోనే వాటిని చట్టాలుగా తీసుకొస్తామన్నారు. దీనిపై చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన యూఎస్ కాంగ్రెస్ ను కోరారు.

హై కెపాసిటీ మేగజైన్స్ లో 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపేలా బుల్లెట్స్ ను నింపవచ్చని.. వాటిని కూడా నియంత్రించాలని సూచించారు. హై కెపాసిటీ బుల్లెట్ మేగజైన్లను నిషేధించనున్నట్లు తెలిపారు. అస్సాల్ట్ వెపన్లకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. ఇకపై అమెరికాలో అస్సాల్ట్ వెపన్స్, హైకెపాసిటీ బుల్లెట్ మేగజైన్లు సాధారణ పౌరుల కోసం అందుబాటులో ఉండవని అన్నారు. ప్రభుత్వ విభాగాలు, అధికారులు మాత్రమే పరిమితంగా వాటిని వాడేలా చట్టాన్ని తీసుకొస్తామన్నారు.