హిందీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో సీజన్2కి చెందిన విజేత అశుతోష్ కౌశిక్ .. అలీఘర్‌కి చెందిన అర్పితని తన ఇంటి టెర్రస్‌పై వివాహం చేసుకున్నాడు. ముందుగానే ముహూర్తం నిర్ణయించబడడంతో అశుతోష్, అర్పితలు మ్యారేజ్ తో ఒక్కటయ్యారు.అయితే ఈ పెళ్లికి పురోహితుడితో పాటు వరుడి తల్లి, సోదరి, వధువు తల్లి, సోదరుడు మాత్రమే హాజరయ్యారు. తన పెళ్లికి సంబంధించిన వీడియోని అశుతోష్ తన ఫేస్ బుక్ పేజ్‌లో షేర్ చేస్తూ.. నిరాడంబరంగా చేసుకోవడం ద్వారా మిగిలిన డబ్బులని పీఎం కేర్స్‌కు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు తన యూట్యూబ్ చానల్ ద్వారా వస్తున్న మొత్తాన్ని కూడా చారిటీకి ఇవ్వనున్నట్టు చెప్పారు అశుతోష్ కౌశిక్.

