Big Boss Telugu 9: బిగ్ బాస్ 9 తెలుగు: హౌస్‌లోకి 'ఫైర్ స్టార్మ్' వైల్డ్ కార్డ్ ఎంట్రీ! కంటెస్టెంట్లకు బిగ్ వార్నింగ్!

Big Boss Telugu 9: బిగ్ బాస్ 9 తెలుగు: హౌస్‌లోకి 'ఫైర్ స్టార్మ్' వైల్డ్ కార్డ్ ఎంట్రీ! కంటెస్టెంట్లకు బిగ్ వార్నింగ్!

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా, ఊహించని మలుపులతో కొనసాగుతోంది. నాలుగు వారాలు పూర్తి చేసుకుని, ఐదో వారంలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఒక పెను ప్రమాదాన్ని సంకేతపూర్వకంగా హెచ్చరించాడు. అదే 'వైల్డ్ కార్డ్' రూపంలో రాబోయే 'ఫైర్ స్టార్మ్' (Fire Storm)! హౌస్ త్వరలో రణరంగంగా మారబోతోందని, డేంజర్ జోన్‌లో ఉన్న వారికి ముప్పు తప్పదని బిగ్ బాస్ ఇచ్చిన వార్నింగ్ ప్రస్తుతం హౌస్‌లో తీవ్ర ఆందోళనను, ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

వైల్డ్ కార్డ్ బెదిరింపుతో భారీ టాస్క్‌లు

సాధారణంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోని పాత సభ్యులకు సవాలు విసురుతాయి. కానీ, ఈసారి బిగ్ బాస్ ఏకంగా వైల్డ్ కార్డ్ ముప్పును తప్పించుకోవడానికి టాస్క్‌లు ఆడేలా కంటెస్టెంట్లను ప్రేరేపించడం విశేషం.  లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలో..  బిగ్ బాస్ హౌస్‌లోని లీడర్ బోర్డులో అందరి ఫోటోలను చూపిస్తూ..  ఈ వారం టాస్క్‌లు అత్యంత భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు. కంటెస్టెంట్లు తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, ముఖ్యంగా డేంజర్ జోన్ నుంచి తప్పించుకోవడానికి ఇసుక టాస్క్ వంటి వాటిలో తీవ్రంగా పోరాడుతున్నారు.

 

వైల్డ్ కార్డ్‌గా ఎవరు రాబోతున్నారు?

ఇప్పటికే శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ వంటి నలుగురు సభ్యులు ఎలిమినేట్ అయిన నేపథ్యంలో, ఇప్పుడు కొత్త పోటీదారుల రాక మిగిలిన వారి ఆట తీరును పూర్తిగా మార్చేయనుంది. బిగ్ బాస్ 9 తెలుగులో ఇప్పటికే కామనర్ దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి, హౌస్‌లో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు రాబోయే సెలబ్రిటీ వైల్డ్ కార్డ్‌ల గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిలో ప్రముఖంగా సీరియల్ ఆర్టిస్ట్‌లు సుహాసిని, కావ్యశ్రీ. యూట్యూబ్ ,  సోషల్ మీడియా సెలబ్రిటీలు అలేఖ్య చిట్టి (పికిల్స్ రమ్య), దివ్వెల మాధురి.  వీరితో పాటు ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

ఈ కొత్త సభ్యులు రావడమే కాకుండా, బిగ్ బాస్ గత సీజన్ల నుండి ప్రేక్షకాదరణ పొందిన పాత కంటెస్టెంట్లు, ముఖ్యంగా వివాదాస్పద వ్యక్తులు తనీష్ లేదా అమర్ దీప్ వంటి వారిని కూడా వైల్డ్ కార్డ్‌గా పంపే అవకాశాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. సాధారణంగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లో పోటీని పెంచడానికి, డ్రామాను సృష్టించడానికి ఉపయోగపడతాయి. ఈసారి ఎక్కువ మంది కొత్త కంటెస్టెంట్లు ఒకేసారి వస్తున్నందున, బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌కు కూడా అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఈ 'ఫైర్ స్టార్మ్' ఎంట్రీలు ఒకేసారి జరుగుతాయా లేక మిడ్-వీక్‌లో ఇద్దరిని పంపిస్తారా అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.