తిరువనంతపురంలో భారీ అగ్నిప్రమాదం…షాపు దగ్ధం

తిరువనంతపురంలో భారీ అగ్నిప్రమాదం…షాపు దగ్ధం

కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  విద్యుత్ షాట్ సర్క్యూట్  కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఓ షాపు పూర్తిగా కాలిపోయింది. ఇందులో సుమారు 2 కోట్ల రూపాయిల వరకు ఆస్తినష్టం జరిగింది. ఇక్కడి పళంపట్టిలోని సెల్వం అంబారై కమర్షియల్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు అందించిన సమాచారంతో అలర్టైన అగ్నిమాపక సిబ్బంది మూడు అగ్నిమాపక వాహనాలలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది రావడంలో ఏమాత్రం ఆలస్యం అయినా పక్కనే ఉన్న మరికొన్బి షాపులుఅగ్నికి ఆహుతయ్యేవని, భారీ జరిగేదన్నారు పోలీసులు. ప్రమాదంపై విచారణ చేపట్టారు. భారీ ప్రమాదం జరగడంతో స్థానికులు మాత్రం భయాందోళనకు గురయ్యారు.