నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దు.. డ్రగ్స్ కేసులో హీరోకు ఊరట

నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దు.. డ్రగ్స్ కేసులో హీరోకు ఊరట

టాలీవుడ్ డ్రగ్స్ కేసు(Tollywood drugs case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌(Navadeep)ను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Also Read :- ఈ కోటి రూపాయల ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?

ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్‌లో వెలికివచ్చిన డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసిందని, అందుకే అతను పరారీలో ఉన్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన నవదీప్.. డగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధంలేదని, తనను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. డ్రగ్స్ కేసులో నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు ఊరట లభించింది.