చిన్నారి పెళ్లికూతురు హీరో మృతి

చిన్నారి పెళ్లికూతురు హీరో మృతి

ముంబై: టీవీ యాక్టర్, బిగ్‌ బాస్–13 విన్నర్, చిన్నారి పెళ్లికూతురు హీరో రోల్‌ చేసిన సిద్ధార్థ్ శుక్లా గురువారం మరణించాడు. ఉదయం ఉన్నట్టుండి హార్ట్ అటాక్‌ రావడంతో ముంబైలోని కూపర్ హాస్పిటల్‌లో చేరారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే అతడు మరణించాడని డాక్టర్లు వెల్లడించారు. 40 ఏండ్ల వయసులోనే ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్త ఆయన కుటుంబంతో పాటు ఫ్యాన్స్‌ను దిగ్బాంతికి గురి చేస్తోంది.

1980 డిసెంబర్‌‌ 12న ముంబైలో అశోక్ శుక్లా, రీటా శుక్లాలకు జన్మించాడు సిద్ధార్థ్ శుక్లా. ఆయన కుటుంబం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ నుంచి వచ్చి ముంబైలో సెటిల్‌ అయింది. ఇంటీరియర్‌‌ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన సిద్ధార్థ్.. యాక్టింగ్‌పై ఆసక్తితో టీవీ సీరియల్స్‌ వైపు వెళ్లాడు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు), దిల్‌ సే దిల్‌ తక్‌ లాంటి సీరియల్స్‌తో బాగా పాపులర్‌‌ అయ్యాడు. బాలికా వధులో ఆనంది భర్తగా హీరో రోల్‌ చేసిన సిద్ధార్థ్‌ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బిగ్‌ బాస్ 13, డ్యాన్స్ దీవానే 3,  ఝలక్‌ దిఖలాజా 6, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్‌ కే ఖిలాడీ లాంటి రియాలిటీ షోలతో పాటు హంప్టీ శర్మ కే దుల్హనియా సినిమాలో కూడా సిద్ధార్థ్‌ మెరిశాడు. బిగ్‌ బాస్‌–13లో సిద్ధార్థ్‌ శుక్లా విన్నర్‌‌గా నిలిచాడు.