
బిగ్ బాస్ సీజన్ 9.. రోజురోజుకూ ఉత్కంఠను పెంచుతూ భారీ అంచనాలకు తగ్గట్టుగానే హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ వారం హౌస్‌లో ఆరుగురు సభ్యులు నామినేషన్స్ హీట్‌ను ఎదుర్కొంటున్నారు. కెప్టెన్ రాము నామినేషన్ నుంచి, అలాగే ఇమ్యూనిటీ గెలుచుకున్న ఇమ్మాన్యుయల్ సేఫ్ జోన్‌లో ఉన్నారు. భరణి, దివ్య, కళ్యాణ్, తనూజ సైతం టాస్క్‌లలో గెలిచి సురక్షితంగా ఉన్నారు.
ప్రమాదంలో ఎవరు?
నామినేషన్లలో ఉన్న ఆరుగురిలో.. సుమన్ శెట్టి, సంజన, శ్రీజ, డీమాన్ పర్వాలేదనే స్థాయిలో ఓట్లను దక్కించుకున్నారు. అయితే, ఆఖరి స్థానాల్లో నిలిచి ప్రమాదంలో ఉన్నవారు రీతూ చౌదరి, ఫ్లోరా సైనీ. ఈ ఇద్దరూ ఈ వారం ఆటలో వంద శాతం ప్రయత్నించినప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనుకబడ్డారు. ఈ సీజన్‌లో తొలిసారిగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందనే వార్త హౌస్‌లో, ప్రేక్షకుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే నిజమైతే శనివారం ఎపిసోడ్‌లో ఒకరు, ఆదివారం ఎపిసోడ్‌లో మరొకరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు. కేవలం సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. డబుల్ ఎలిమినేషన్ అయితే, కచ్చితంగా ఫ్లోరా, రీతూ చౌదరి ఇద్దరూ ఇంటికి వెళ్లడం ఖాయం. ఇప్పటికే ఈ ఇద్దరు తొలగింపు లిస్టులో చేరిపోయారు.
ఫ్లోరా సైనీ అవుట్.. ఎందుకంటే?
మొదటి నుంచి ఫ్లోరా సైనీ ఆట తీరు ప్రేక్షకులకు అస్సలు రుచించలేదు. ఆమెపై ఎటువంటి వ్యతిరేకత లేకపోయినా.. ఇంపాక్ట్ చూపించకపోవడమే అతి పెద్ద మైనస్ పాయింట్. గతంలో కామనర్ల ఓవరాక్షన్ వల్ల మొదట్లో వారే ఎలిమినేట్ కావడంతో ఫ్లోరా సేఫ్ అవుతూ వచ్చింది. కానీ ఆమె హౌస్‌కు ఎటువంటి ప్లస్ అందించకపోవడం, సైలెంట్ కంటెస్టెంట్ గా ఉండటం బిగ్ బాస్‌కు కూడా నచ్చలేదనేది టాక్. ఆమె 'తిన్నామా, పడుకున్నామా, గేమ్స్ ఆడామా' అన్న రీతిలో సైలెంట్‌గా ఉంటూ ఎంటర్‌టైన్‌మెంట్‌కు దూరంగా ఉంది. సంచాలక్‌గా కూడా తప్పులు చేయడంతో, ఆమె ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకే ఈ వారం, బిగ్ బాస్ ఆమెను డైరెక్ట్‌గా నామినేట్ చేసి, ఆమె ఎలిమినేషన్‌కు గట్టి స్కెచ్ వేశారని టాక్ వినిపిస్తోంది.
►ALSO READ | Priyanka Mohan: "నన్ను తప్పుగా చిత్రీకరించకండి".. ఫేక్ ఫోటోలపై ప్రియాంక మోహన్ ఫైర్!
వైల్డ్ కార్డ్ ఎంట్రీల సునామీ!
ఈ వారం ఎలిమినేషన్ కంటే కూడా అతిపెద్ద ఉత్కంఠ ఏంటంటే... ఆదివారం నాడు ఉండబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. డబుల్ ఎలిమినేషన్‌తో ఖాళీ అయిన హౌస్‌లోకి 'బిగ్ బాస్ 2.0' ఎపిసోడ్ పేరుతో ఏకంగా ఆరుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించబోతున్నారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీల షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని వార్తలు రావడంతో.. హౌస్‌లో కొత్త పోటీ, కొత్త డ్రామా మొదలు కాబోతోంది. ఈ సడన్ ఎలిమినేషన్స్, భారీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ 9 మరింత రసకందాయకంలో పడటం ఖాయం అంటున్నారు అభిమానులు.