Sanaa Sultan: నటిగా మారిన యూట్యూబర్.. ప్రత్యేక విమానాల్లో తిరుగుతోంది..!

Sanaa Sultan: నటిగా మారిన యూట్యూబర్.. ప్రత్యేక విమానాల్లో తిరుగుతోంది..!

సనా సుల్తాన్.. ప్రస్తుతం నేషనల్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. కారణం.. ఆమె త్వరలో హిందీలో మొదలుకానున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3కి సెలెక్ట్ అవడం. టిక్ టాక్ వీడియోలతో మొదలైన ఆమె ప్రయాణం బిగ్ బాస్ వరకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాంతో.. నటి సనా సుల్తాన్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి సనా సుల్తాన్ గురించి ఎవరికీ తెలియని విషయాలు మీకోసం. 

సనా సుల్తాన్ 20115లో యూట్యూబర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఆతరువాత వచ్చిన టిక్ టాక్ తో ఇన్ఫ్లుయెన్షర్ గా మారారు సనా సుల్తాన్. అక్కడి నుండి ఆమె ఫోలోవెర్స్ భారీగా పెరిగారు. ఆ ఫేమ్ తోనే.. హిందీలో షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోస్ చేసింది. అనంతరం మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి 2019లో UC మిస్ క్రికెట్ టైటిల్‌, ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే ఐకాన్ అవార్డ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ దుబాయ్‌లో 2023లో షైనింగ్ స్టార్ అఫ్ ది ఇయర్ అవార్డ్స్ గెలిచింది సనా.

దాంతో ఆమె ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ తో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సనా సుల్తాన్. ఆ ఫొటోలో సనా.. ఒక విలాసవంతమైన భవనం, ప్రయివేట్ విమానం లో ప్రయాణిస్తున్నట్టుగా ఉంది. ఆమె లగ్జరీ లైఫ్ చూసి నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఇదిలా ఉంటే.. సనా సుల్తాన్ బిగ్ బాస్ ఎంట్రీ గురించి ఒక నెటిజన్.. బిగ్ బాస్ లోకి వెళ్ళాక ఎవరితోనైనా ప్రేమలో పెడుతారా అని అడిగాడు. దానికి సమాధానంగా సనా సుల్తాన్.. ప్రేమ అనేది నేను బలహీనతగా భావిస్తాను. బిగ్ బాస్ హౌస్ లో మనం దృడంగా ఉండాలి. బలహీనంగా కాదు. అందుకే ఆ విషయం గురించి ఆలోచించడం లేదని చెప్పుకొచ్చింది సనా.