బిగ్బాస్ సీజన్ 7లో పాల్గొనే ఆ ఏడుగురు వీళ్లే!

బిగ్బాస్ సీజన్ 7లో పాల్గొనే ఆ ఏడుగురు వీళ్లే!

బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season 7) కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొత్త సీజన్ ఎలా ఉండబోతుంది? కంటేస్టెంట్ లుగా ఎవరు వస్తున్నారు? గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటూ తెగ ఆలోచిస్తున్నారు. ఇక మేకర్స్ కూడా బిగ్ బాస్ సీజన్ 7ను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. కంటేస్టెంట్ విషయంలో, గేమ్స్ విషయంలో గత సీజన్ లో వచ్చిన ఫాల్ట్స్ జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొనబోయే కంటేస్టెంట్ లిస్టు సొసైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీజన్ లో మొత్తం 22 మంది కంటేస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు. వారిలో ఏడుగురికి సంబంధించిన లిస్టు బయటకు వచ్చిందని సమాచారం. ఈ లిస్టు ఇప్పడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో టీవీ యాక్టర్ అనూష రెడ్డి, జబర్దస్త్ కమెడియన్ నరేష్(పొట్టి నరేష్), డాన్సర్ ఆట సందీప్, సింగర్ భోలే శావళి, కమెడియన్ మహేష్(రంగస్థలం), మోడల్ అండ్ సీరియల్ యాక్టర్ ప్రిన్స్ యవర్ ఉన్నారు. ఇంకా 15 మందికి సంబంధించిన లిస్టు తెలియాల్సి ఉంది. ఆ వివరాలు కూడా త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.       

ఇక ఈ కొత్త సీజన్ కు కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జుననే వ్యవహరించనున్నారు. తాజాగా ప్రోమో కూడా బయటకు వచ్చింది. ఈ ప్రోమో సీజన్ 7పై అంచనాలు పెంచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.  మరీ ముఖ్యంగా.. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు నాగార్జున. దీంతో ఈ కొత్త సీజన్ పై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సీజన్ ఆడియన్స్ ను ఏమేరకు ఎంటర్టైన్ చేయనుందో తెలియాలంటే  మరికొన్ని రోజులు ఆగాల్సిందే.