
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) అప్పుడే సెకండ్ వీక్ కు చేరుకుంది. ఫస్ట్ వీక్ లో కిరణ్ రాథోడ్(Kiran Rathod) ఇంటి నుండి ఎలిమినేట్ అయినా విషయం తెల్సిందే. తాజాగా సెకండ్ వీక్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ వీక్ నామినేషన్స్ కాస్త నార్మల్ గా సాగినా.. సెకండ్ వీక్ మాత్రం హీటెక్కిపోయేలా ఉంది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు రీజన్స్ చెప్పుకుంటూ రెచ్చిపోయారు. నాదగ్గర అవన్నీ కుదరవు అని ఒకరంటే.. నీకంత సీన్ లేదు అంటూ మరొకరు కౌంటర్లు వేసుకున్నారు.
ఇక సెకండ్ వీక్ నామినేషన్స్ కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ మాస్. కంటెస్టెంట్స్ లో ఒకరు ముందుకు వచ్చి నిల్చుంటే.. ఆ కంటెస్టెంట్ ను ఎవరెవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో బజార్ నొక్కి సీజన్స్ చెప్పాలని చెప్పాడు బిగ్ బాస్. ఇందులో ముందుగా ప్రిన్స్ యావర్ నిల్చోగా అతన్ని ఆట సందీప్ నామినేట్ చేశాడు. నువ్వు నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నావ్ అని యావర్ అనగా.. అలా చేసుంటే ప్రశాంత్ ను చేస్తాను నిన్ను కాదు అంటూ సమాధానం ఇచ్చాడు సందీప్.
ఆతరువాత శివాజీ నిల్చోగా అతన్ని ప్రియాంక అండ్ అమర్ డీప్ నామినేట్ చేశారు. ఈ ప్రాసెస్ లో ఈ ముగ్గురి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. ప్రశాంత్ విషయంలో తనని కంపేర్ చేస్తూ మాట్లాడిన మాటలు నచ్చలేదని అమర్, ఒకరు మాట్లాడుతుంటే వారిని మధ్యలో కట్ చేసి మీరు మాట్లాడి కమాండ్ చేస్తున్నారంటూ ప్రియాంక శివాజీనీ నామినేట్ చేశారు.
దానికి సమాధానంగా శివాజీ మాట్లాడుతూ.. మీకు అంత సీన్ లేదని, నాదగ్గర అవని కుదరవని, నేను ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చానని చాలా కోపంగా చెప్పుకొచ్చాడు శివాజీ. ఇవన్నీ చూస్తుంటే ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా జరిగేలా కనిపిస్తోంది.