
కమల్‌హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ బిగ్ బాస్ ఐదో సీజన్ ముగిసింది. ఐదు సీజన్లకి కమల్ హోస్ట్‌గా ఉండడం విశేషం. ఇక్కడ మరో సర్ప్రైజింగ్ విషయం ఏమంటే... ఐదుసార్లు ఎలిమినేషన్ వరకు వెళ్లిన రాజు జయమోహన్ విన్నర్‌గా నిలిచాడు. రాజుకు మిమిక్రీ వచ్చు. స్టాండ్ అప్ కామెడీ కూడా చేస్తాడు. హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ టాస్కుల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశాడు. ఆడియెన్స్‌ని, హౌస్‌మేట్స్‌ని తనదైన కామెడీతో మస్త్ ఎంటర్టైన్ చేశాడు. సోషల్ మీడియాలో రాజు కామెడీ వీడియోలు వైరల్ అవ్వడం కూడా ఓటింగ్ టైమ్‌లో కలిసొచ్చాయి. హౌస్‌లోనే కాకుండా ఆడియెన్స్ నుంచి కూడా రాజుకు సపోర్ట్ లభించడంతో ఈ సీజన్ విన్నర్ అయ్యాడు. ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెల్చుకున్నాడు. యాక్టర్ శివకార్తికేయన్ గ్రాండ్ ఫినాలేకి స్పెషల్ గెస్ట్. ఫస్ట్ రన్నరప్‌గా వీడియో జాకీ ప్రియాంక దేశ్‌పాండే నిలిచింది.