Bigg Boss 9 Elimination: డాక్టర్ పాప 3 వారాలకే ఎలిమినేట్.. కారణం అదేనంటా..! ఎన్ని లక్షలు సంపాదించిందంటే?

Bigg Boss 9 Elimination: డాక్టర్ పాప 3 వారాలకే ఎలిమినేట్.. కారణం అదేనంటా..! ఎన్ని లక్షలు సంపాదించిందంటే?

‘బిగ్‌బాస్‌ సీజన్ 9’ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ ఇంటిబాట పడుతున్నారు. బిగ్‌బాస్‌ 9 సీజన్ స్టార్ట్ అయినప్పుడు.. మొత్తం 15 మంది హౌస్‌మేట్లు ఉండగా, వారిలో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు ఉన్నారు. ఇప్పుడు మూడు వారలు కంప్లీట్ చేసుకుని, ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది.

ఫస్ట్ వీక్లో కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ.. రెండోవారంలో మర్యాద మనీష్‌లు హౌస్ నుంచి బయటకి వచ్చారు. ఈ క్రమంలో మూడో వారం (సెప్టెంబర్ 28) డాక్టర్ ప్రియ శెట్టి ఎలిమినేట్ అయింది. మొత్తంగా ఆరుగురు సామాన్యుల్లో ఒకరిగా అడుగుపెట్టింది ఈ ప్రియ. నిజానికి బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ప్రియశెట్టి చాలా ఇంప్రెస్ చేసింది. అలా ఎక్కువ వారాలు ఉంటుందని ముందు అందరూ భావించారు. కానీ, తన ఆట తీరుతో ఆడియన్స్ను మెప్పించలేకపోయింది.

అయితే, అనూహ్యంగా సీజన్ 9 నుంచి ఔట్ అవ్వడానికి తన ఓవరాక్షనే ముఖ్య కారణమని ఆడియన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఓవరాక్షన్ చేస్తూ ఆడియెన్స్‌ను ఇరిటేట్ చేసింది ఈ ప్రియ. లేదంటే ఇంకొన్ని వారలు ఉండేదని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే.. ఈ మూడో వారం సీజన్ 9 నామినేషన్స్‌లో రీతూ చౌదరి, రాము రాథోడ్, ప్రియా శెట్టి, హరిత హరీష్, కల్యాణ్ పడాల ఐదుగురు ఉన్నారు. ఈ 5గురిలో డేంజర్ జోన్‌లో ఉన్న సోల్జర్ కల్యాణ్ పడాల, ప్రియా శెట్టి మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. ఆ తర్వాత అతి తక్కువ ఓట్లతో సీజన్ 9 మూడో వికెట్గా ప్రియా శెట్టి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. 

ఇదిలా ఉంటే.. కామనర్గా సీజన్కి ఎంట్రీ ఇచ్చిన ప్రియా శెట్టి.. మూడో వారాల్లో ఎంత సంపాదించిందనేది హాట్ టాపిక్గా మారింది. కర్నూలుకి చెందిన ప్రియా శెట్టి వారానికి రూ.60 నుంచి 70 వేల మధ్య రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన మూడు వారాలు హౌజ్‌లో ఉన్న ప్రియా బిగ్బాస్ ద్వారా రూ.2 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని టాక్.  అయితే, మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే.. ఈ అమౌంట్ తక్కువే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.