మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ 

మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ 

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం  ‘మెన్షన్ హౌస్ మల్లేష్’.  గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్.  కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై రాజేష్  నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన  ఫస్ట్ సాంగ్, టీజర్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం రెండో పాటను  రిలీజ్ చేశారు.  సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ఈ పాటకు తరుణ్ సైదుల్ లిరిక్స్ రాయగా, బిత్తిరి సత్తి పాడిన తీరు ఆకట్టుకుంది. ‘

మింగలేక మంగళారాం.. అన్నట్టైందిరా భారం. అసలు పాయింట్ మీద దెబ్బ పడ్డదిరా.. ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం.. బ్యాటింగ్ పట్టక ముందే అవుట్‌‌‌‌ అయిపోతివా.. అందరికీ తెలిసిపోయిరా.. వీడి ఇజ్జత్ పోయెరా’  అంటూ సాగిన పాటలో  మల్లేష్  క్యారెక్టర్ గురించి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా చూపించిన విధానం అలరించింది.  ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మార్చి 6న సినిమా విడుదల కానుంది.