Elvis Yadav: జైలు నుండి వచ్చాడు.. రూ.3 కోట్ల లగ్జరీ కారు కొన్నాడు.

Elvis Yadav: జైలు నుండి వచ్చాడు.. రూ.3 కోట్ల లగ్జరీ కారు కొన్నాడు.

ఎల్విశ్ యాదవ్(Elvis Yadav).. ఈ మధ్య ఈ పేరు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. కారణం.. ఇటీవలే పాము విషం కేసులో అరెస్ట్‌ అయ్యాడు. ముందు యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌ సంపాదించుకున్న ఎల్విశ్.. బిగ్‌బాస్‌ విన్ అయిన తరువాత మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ అనంతరం ఓ ప్రైవేట్ పార్టీలో జరిగిన పాము విషం కేసులో అరెస్ట్ అయిన ఎల్విశ్.. ప్రస్తుతం బెయిల్‌పై  బయటకు వచ్చాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా తాను ఖరీదైన లగ్జరీ కారును కొన్నట్లుగా ఓ వవీడియో చేశాడు ఎల్విశ్. అది అతి ఖరీదైన మెర్సిడెస్ గ్వాగన్‌ మోడల్ కారు. దాని విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఆ వీడేమోలో కారు గురించి వివరించిన ఎల్విశ్.. 2022లోనే ఈ కారును కొనాలనుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఎల్విశ్ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.