BiggBossTelugu8 : బిగ్బాస్ 8 గ్రాండ్ లాంచ్.. హౌస్లోకి వెళ్లింది వీళ్లే...

BiggBossTelugu8 : బిగ్బాస్ 8 గ్రాండ్ లాంచ్.. హౌస్లోకి వెళ్లింది వీళ్లే...

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు బిగ్ బాస్ 8 సీజన్  స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ 1 రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యింది.  హోస్ట్ గా నాగార్జున తనదైన స్టైల్ లో షోను  స్టార్ట్ చేశారు. అయితే ఈ సారి డిఫరెంట్ గా  ఒక మేల్ ఒక ఫిమెల్ కంటెస్ట్ ను కలిపి బిగ్ బాస్ హౌస్ లోకి  పంపిస్తున్నారు. 

ఫస్ట్ టీవీ నటి యష్మీ గౌడ.. యాక్టర్ నిఖిల్ కలిసి బిగ్ బాస్  హౌస్ లోకి వెళ్లారు.  

ఆ తర్వాత రెండో జోడీగా పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ ..టీవీ నటి ప్రేరను కలిపి ఇంకో జోడిగా  బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. 

మూడో జోడీగా  లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆదిత్య ఓం.. రాంగోపాల్‌ వర్మ తీసిన దిశ మూవీ నటి సోనియా బిగ్‌బాస్‌ లోకి వెళ్లారు. 

నాలుగో జోడీగా సోషల్ మీడియాలో  బెజవాడ బేబక్కగా ఫేమస్ అయిన నటి మధు నెక్కంటి.. ఈ మద్య రాజ్ తరుణ్ లావాణ్య ఎపిసోడ్ లో పాపులర్ అయిన నటుడు శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు.

ఐదో జోడీగా బేబీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి కిరాక్ సీత..  నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.

ఆరో జోడీగా పృథ్విరాజ్..తెలుగు టీవీ షోలలో యాంకర్ గా ఫేమస్ అయిన విష్ణు ప్రియ

ఏడో జోడీగా ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన నైనిక .. నబీల్ ఆఫ్రిది  బిగ్‌బాస్‌ సీజన్‌-8లోకి అడుగు పెట్టారు.

ALSO READ | Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8 అప్డేట్..ఇవాళే హౌజ్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ!