బీహారీలకు గుడ్ న్యూస్ చెప్పిన నితీశ్

 బీహారీలకు గుడ్ న్యూస్ చెప్పిన నితీశ్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీహార్ లోని యవతకు  సీఎం నితీశ్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో నితీశ్ కుమార్  మాట్లాడుతూ.. తమ సంకీర్ణ ప్రభుత్వ ఆకాంక్ష మేరకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మరో 10 లక్షల ఉపాధి అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం తాము పెద్ద ఎత్తున కృషి చేస్తామని  వెల్లడించారు.  

సీఎం ప్రకటనపై డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రెండు పార్టీలు కలిసికట్టుగా పని చేస్తాయని తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను 20 లక్షల ఉద్యోగాలకు పెంచుతామని తెలిపారు. నిరుద్యోగాన్ని అంతం చేయడం తమ ప్రధాన అజెండాలలో ఒకటని ఆయన అన్నారు. 

బీహార్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకవేళ ఆర్జేడీ  అధికారంలోకి వస్తే యువతకు10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ యాదవ్‌ హామీ ఇచ్చారు. అయితే అప్పుడు ఆర్జేడీ అధికారంలోకి రాలేదు. ఇటీవల బీహార్ లో జరిగిన రాజకీయ పరిణామల నేపథ్యంలో  మొన్నటివరకు రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న  నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ ఇప్పుడు ఒక్కటై ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తేజస్వీ ఆకాంక్షను నెరవేర్చేలా సీఎం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ  భారీ హామీని ప్రకటించారు.