బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీకి కరోనా పాజిటివ్

బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీకి కరోనా పాజిటివ్

బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీకి కరోనా వైరస్ సోకింది. కొద్ది రోజులుగా జ్వరం ఉండడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని, దీంతో పాట్నాలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యానని ఆయన తెలిపారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని, తర్వలోనే డిశార్జ్ అయ్యి ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొంటానని సుశీల్ కుమార్ మోడీ చెప్పారు.

‘‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అంతా నార్మల్‌గానే ఉంది. కొద్ది రోజుల క్రితం మైల్డ్ ఫీవర్ వచ్చింది. రెండ్రోజుల నుంచి ఆ జ్వరం కూడా లేదు. మంచి కేర్ కోసం పాట్నా ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యాను. లంగ్స్‌కు సీటీ స్కాన్ చేస్తే రిపోర్ట్ నార్మల్ వచ్చింది. త్వరలోనే క్యాంపెయినింగ్‌కి వచ్చేస్తా’’ అంటూ గురువారం మధ్యాహ్నం సుశీల్ కుమార్ మోడీ ట్వీట్ చేశారు.

అక్టోబర్ 19న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆయన కొద్ది రోజుల ముందు సుశీల్ కుమార్ మోడీ సహా బీహార్‌కు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలతో కలిసి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హుస్సేన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయా నేతలంతా క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత జ్వరం రావడంతో సుశీల్ కుమార్ మోడీ టెస్టు చేయించుకోగా.. ఆయనకూ పాజిటివ్ వచ్చింది.