మూడ్రోజుల ముచ్చట.. మంత్రి పదవికి రాజీనామా

మూడ్రోజుల ముచ్చట.. మంత్రి పదవికి రాజీనామా

బీహార్‌ లో కొత్తగా కొలువుదీరిన మంత్రి వర్గంలో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన JDU నేత మేవాలాల్‌ చౌదరి తన పదవికి ఇవాళ (గురువారం) రాజీనామా చేశారు. గతంలో ఆయనపై అవినీతి ఆరోపణలుండగా..ఇప్పుడు ప్రతిపక్షాలు ఆ ఆరోపణలను లేవనెత్తడంతో బాధ్యతలు చేట్టిన మూడు రోజులకే పదవి నుండి తప్పుకున్నారు. సోమవారం విద్యా శాఖ మంత్రిగా చౌదరి ప్రమాణ స్వీకారం చేయగా..ప్రతిపక్ష ఆర్జేడీ తీవ్ర విమర్శలు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మంత్రి పదవులవ్వడంపై ఆరోపణలు చేసింది. దీంతో ఆయన మంత్రి పదవికి గురువారం రాజీనామా చేయక తప్పలేదు.

మేవాలాల్‌ చౌదరి 2017లో భాగల్‌పూర్‌ వ్యవసాయ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌గా ఉన్న సమయంలో…అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జూనియర్‌ సైంటిస్ట్‌ నియామక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పటి గవర్నర్‌ …ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదేశాలతో ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి చార్జీషీటు దాఖలు కాలేదు.