
కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల చోరీ జరిగింది.. ఇప్పుడు బీహార్ లో కూడా అదే జరుగుతోంది.. ఎన్డీఏ గెలుపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఆ పని చేస్తుందంటూ ఇండియా కూటమి నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ లో ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)- సర్ ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షాల విమర్శల నడుమ ఈసీ బీహార్ ఓటర్ల లిస్టును మంగళవారం (సెప్టెంబర్ 30) విడుదల చేసింది.
బీహార్ లో మొత్తం 48 లక్షల ఓటర్లను డిలీట్ చేసింది ఈసీ. మరోవైపు 21 లక్షల కొత్త ఓటర్లను చేర్చింది. కొత్త లిస్టు ప్రకారం బీహార్ లో మొత్తం 7 కోట్ల 42 లక్షల ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అంటే త్వరలో జరిగే ఎన్నికల్లో ఏడు కోట్ల 42 లక్షల మంది ఓటు వేసేందుకు అర్హులు.
సర్ ప్రకారం.. ఫైనల్ ఓటర్ లిస్టును పబ్లిష్ చేశాం. ఓటర్లు తమ డీటైల్స్ ను చెక్ చేసుకోవచ్చు అని ఈసీ తెలిపింది. బీహార్ లో 22 ఏళ్ల తర్వాత సర్ ప్రక్రియను చేసింది ఈసీ.
2024 లోక్ సభ ఎన్నికల తర్వాత జూన్ 24 వరకు బీహార్ లో 7 కోట్ల 79 లక్షల ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 65 లక్షల ఓట్లను తొలగించడంతో ఆ సంఖ్య 7 కోట్ల 24 లక్షలకు చేరుకుంది. అలాగే కొత్తగా ఓటుకు అర్హత సాధించిన వారితో కలుపుకుని 7 కోట్ల 42 లక్షలకు చేరుకుందని ఈసీ తెలిపింది.
ఎన్డీఏ వ్యతిరేక ఓట్లు తొలగించి ఈసీ ఆ కూటమికి మేలు చేస్తోందని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఏ ఒక్క ఓటర్ ను తొలగించడం జరగదని ఈసీ చెబుతూ వస్తో్ంది.
బీహార్ అసెంబ్లీ 2025 నవంబర్ 22 తో ముగుస్తుంది. దీంతో త్వరలోనే అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.