
- తమకే ఆ పదవి కావాలని పార్టీల బెట్టు
- బీహార్ ప్రతిపక్షాలది తలోదారి
పాట్నా: ప్రతిపక్ష నేతల మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడం, దాదాపు అందరూ ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచు కోవడంతో బీహార్ లో ‘మహాకూటమి’ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న కూటమి.. వచ్చే అసెంబ్లీ ఎన్ని కల్లోనైనా సత్తాచాటుకోవాలని భావిస్తున్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడటంలేదు. తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని రా ష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాం గ్రెస్, మాజీ సీఎం జీతన్ రాం మాంఝీకి చెందిన హిందుస్థానీ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం), ఉపేంద్ర కుష్వాహ ఆధ్వర్యం లోని రాష్ట్రీయ లోక్ సమతా పా ర్టీ(ఆర్ఎల్ఎస్పీ), ము ఖేశ్ సహానీ ప్రెసిడెంట్ గా ఉన్న వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లు బీహార్‌లో మహాకూ టమిగా కొనసాగుతున్నాయి. ఎన్ని కల వ్యూహాలపై చర్చించేందుకు కూటమి నేతలు ఈమధ్యనే పా ట్నాలో సమావేశమయ్యారు. వీఐపీ తప్ప మిగతా నాలుగు పార్టీలూ సీఎం అభ్యర్థి తమపార్టీకి చెం దిన నేతకే అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుపట్టడంతో చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి.
కూటమిలో బలమైన పా ర్టీ ఆర్జేడీనే కాబట్టి తే జస్వీ యాదవ్ నే సీఎం క్యాండేట్‌గా ప్రకటించాలని ఆ పార్టీలో మెజార్టీ నేతలు డిమాండ్ చేశారు. తేజస్వీకి పోల్ మేనేజ్ మెంట్ రాదు కాబట్టే లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బతిన్నాడని, జితన్ రాం మాంఝీ లాంటి సీనియర్‌ను సీఎంగా ప్రకటిస్తేనే జనం కూటమికి ఓట్లేస్తారని హెచ్ఏఎం లీడర్లు వాదిస్తున్నారు.
ఒకవేళ మహాకూ టమి తనను సీఎం క్యాం డేట్‌గా ఎన్నుకోకుంటే.. పప్పూ యాదవ్ (జన్ అధికారి పార్టీ)తో కలిసి మూ డో కూ టమి ఏర్పాటు చేసుకుంటానని మాం ఝీ వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఎల్ఎస్పీ నేత ఉపేంద్ర కుష్వాహ కూ డా సీఎం పోస్టు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ‘‘యాదవులు-(ఆర్జేడీ), కుర్మీలు(సీఎం నితీశ్ కులం) బీహార్‌ని 30 ఏండ్ లు పాలించారు. ఇప్పుడిక కోయిరీల(కుష్వాహ కులం) వంతు ’’ అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మహాకూ టమిలోని కాం గ్రెస్ కూడా ఈసారి బీహార్‌లో ఒంటరి పోరుకు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. బీహార్ పీసీసీ చీఫ్ మదన్ మోహన్ ఝా ఈమధ్య పార్టీ చీఫ్ సోనియా గాంధీతో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. 2020 అసెంబ్లీ ఎన్ని కలకు సెమీస్‌గా భావిస్తున్న ఉప ఎన్ని కలు ఇంకో రెండు నెలల్లో జరుగనున్నాయి. ఐదు అసెంబ్లీ , ఒక లోక్‌సభ స్థా నానికి జరిగే బైపోల్లో గెలిస్తేనే మహాకూ టమి నిలబడుతుందని, లేకుంటే అసెంబ్లీ ఎన్ని కల్లోపే కనుమరుగైపోయే అవకాశాలున్నాయిని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
మహాకూటమిలో ఉన్న పార్టీలు
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాం గ్రెస్ ,మాజీ సీఎం జీతన్ రాం మాం ఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా(హెచ్ ఏఎం), ఉపేంద్ర కుష్వాహ ఆధ్వర్యం లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ ఎల్ఎస్పీ ), ముఖేశ్ సహానీ అధ్యక్షుడిగా ఉన్న వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ).
జైట్లీలేని బీజేపీతో నితీశ్‌కి ఇబ్బందులు
మహాకూటమిలో సీఎం క్యాండేట్‌పై రగడ నడుస్తుండగా, అధికార ఎన్డీఏ కూటమిలో ‘ఎన్ఆర్సీ’ వ్యవహారం చిచ్చురేపింది. అస్సాంలాగే బీహార్‌లోనూ బంగ్లాదేశీయులు అక్రమంగా తిష్టవేశారని వాదిస్తోన్న బీజేపీ నేతలు.. రాష్ట్రంలోనూ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నితీశ్ కేబినెట్లో బీజేపీకి చెందిన మంత్రి వినోద్ సింగ్ ఈమధ్య ఎన్ఆర్సీపై బహిరంగ ప్రకటన చేయడం సంచలనం రేపింది. కేంద్ర కేబినెట్లో బెర్తుల కేటాయింపు విషయంలో బీజేపీపై అలిగిన జేడీఎస్ చీఫ్ నితీశ్ కుమార్.. బీహార్‌లో తప్ప మిగతా ప్రాంతాల్లో ఎన్డీఏ పార్ట్నర్గా ఉండబోమని కొద్దినెలల కిందటే ప్రకటించారు. మోడీ సర్కార్ కీలకంగా భావించిన ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు బిల్లునూ జేడీఎస్ ఎంపీలు వ్యతిరేకించారు. ఎన్ఆర్సీపై బీజేపీ వెనక్కి తగ్గకుంటే బీహార్‌లో ఒంటరిగానే పోరాడుదామన్న ఆలోచనలో నితీశ్ ఉన్నట్లు సమాచారం. గతంలో బీజేపీ, జేడీఎస్ మధ్య విభేదాలు తలెత్తిన ప్రతిసారి అరుణ్ జైట్లీనే నితీశ్‌తో మాట్లాడి పరిష్కరించేవారని, ఇప్పుడాయన లేకపోవడం నితీశ్‌కు మరింత ఇబ్బందిగా మారిందని పార్టీ నేతలు అన్నారు. జైట్లీ వల్లే బీహార్ ప్రజలకు సేవచేసే అవకాశం తనకు దక్కిందని నితీశ్ ఓపెన్‌గా చెప్పారు. వాళ్లిద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఉంది కాబట్టే, బీహార్‌లో జైట్లీ విగ్రహం ఏర్పాటుచేసి, ఆయన జయంతిని రాష్ట్ర వేడుకగా జరుపుతామని సీఎం నితీశ్ ప్రకటించారు. జైట్లీ లేని లోటుకుతోడు స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ కూడా కొద్ది నెలలుగా వెస్ట్బెంగాల్లోనే మకాం వేయడంతో బీజేపీ, నితీశ్ మధ్య సయోధ్యకు అవకాశం లేకుండా పోయిందంటున్నారు.