వీళ్లేం పోలీసులు..? కనీసం మానవత్వం లేకుండా డెడ్బాడీని కాల్వలో పడేశారు

 వీళ్లేం పోలీసులు..? కనీసం మానవత్వం లేకుండా డెడ్బాడీని కాల్వలో పడేశారు

కొంతమంది పోలీసులు, సిబ్బంది తీరు ఆ శాఖకే మచ్చ తెస్తుంది. తాజాగా బీహార్ లో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ముజఫర్​పూర్ లో రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే వారు ఘటనాస్థలానికి వెళ్లారు. 

అయితే.. ప్రమాదంలో ప్రాణం కోల్పోయిన వ్యక్తి డెడ్​ బాడీని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం కోసం దగ్గరలోని ప్రభుత్వ మార్చురీకి తరలించాలి. కానీ.. అలా చేయలేదు ఆ పోలీసులు. 

చనిపోయిన వ్యక్తి డెడ్​ బాడీని కాల్వలో పడేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన పోలీసులే.. కనీసం మానత్వం లేకుండా వ్యవహరించడంపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వ్యక్తి మృతదేహాన్ని కాల్వలో పడేస్తున్న క్రమంలో అటు వైపు వెళ్తున్న కొంతమంది వ్యక్తులు వీడియో తీశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ గా మారడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. రోడ్డు ప్రమాదంలో మృతదేహం పూర్తిగా ఛిద్రమైందని, కొన్ని శరీరభాగాలను రికవరీ చేయడానికి సాధ్యం కాకపోవడంతోనే వాటిని కాల్వలో పడేశారని ఉన్నతాధికారులు మీడియాకు వివరణ ఇచ్చారు.

ఈ ఇష్యూ సీరియస్ గా మారడంతో కాల్వలోని మృతదేహాన్ని బయటకు తీసి.. డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. డెడ్ బాడీని కాల్వలో పడేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. డ్రైవర్, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరో ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు.