కాబోయే అత్తామామలకు కోడలి న్యూడ్ ఫోటోలు పంపిన లవర్

V6 Velugu Posted on Aug 06, 2021

తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని ఓ యువతి అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడో ఓ యువకుడు. ఈ ఘటన బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో వెలుగుచూసింది. బత్నాల పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిబెలా గ్రామానికి చెందిన పప్పు కుమార్ సాహు స్థానికంగా నివసించే యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ యువతి కుటుంబసభ్యులకు ఇష్టంలేదు. దాంతో సాహును పిలిచి.. తమ అమ్మాయిని మరచిపోవాలని కోరారు. తమ అయితే కోపం పెంచుకున్న సాహు.. యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను యువతి కుటుంబసభ్యులకు పంపించేవాడు. సాహు ప్రవర్తన నచ్చని యువతి కుటుంబసభ్యులు.. యువతికి వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించారు. దాంతో యువతిని తనకు కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆమె న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. 

యువతికి వేరే వ్యక్తితో పెళ్లి ఖాయం కావడంతో.. సాహు యువతికి కాబోయే అత్తామామలకు ఆమె న్యూడ్ ఫోటోలు పంపించాడు. దాంతో వారు పెళ్లిని క్యాన్సల్ చేసుకున్నారు. ఈ పరిణామంతో యువతి మేనమామ సీతామర్హీలోని పుప్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సాహును అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి యువతి ఫోటోలను తొలగించమని సైబర్ సెల్‌ను కోరినట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తెలిపారు.

Tagged bihar, Social media, love, marriage, nude photos, Sitamarhi, intimate photos

Latest Videos

Subscribe Now

More News