తిరుమలకు ప్రయాణించే రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ(అక్టోబర్ 29న) జరిగిన ప్రమాదంలో రెండు ద్విచక్రవాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సదరు టూవీలర్లపై ప్రయాణం చేస్తున్న ఇద్దరు వాహనదారులు గాయపడినట్లు ప్రాథమికంగా వెల్లడైంది.
బైక్స్ ఒకదానిని మరొకటి ఢీకొన్న ప్రమాద ఘటన అలిపిరి చెక్ పోస్ట్ దాటిన వెంటనే చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తులను ఆస్పత్రికి తరలించి అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు.
ALSO READ : మోంథా తుఫాను ఎఫెక్ట్..
ఈ ఘటన కారణంగా ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బంది కొంత ఆలస్యానికి కారణమైంది. దీంతో అధికారులు ట్రాఫిక్ నియంత్రణలో ప్రత్యేక దృష్టి పెట్టి రద్దీని క్లియర్ చేశారు. ఘాట్ రోడ్ ప్రయాణ సమయంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, స్పీడ్ లిమిట్స్ అతిక్రమించటం, ఓవర్ టేక్ చేయటం వంటివి మానుకోవాలని అధికారులు చెబుతున్నారు.
