మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనకనుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తు్న్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం (మే20) తెల్లవారుజామున మహబూబాబాద్ జిల్లా వెలికట్టె శివారులో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె గ్రామ శివారులో ధాన్యం లోడుతో వెళ్తున్ ట్రాక్టర్ ను బైక్ ఢీకొట్టింది.బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దంతాపల్లి మండలం బోర్లాడకు చెందిన అల్లి సంపత్(25), లింగమల్ల సతీష్(28), పొట్టకర్ల వంశీ (22) గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మరణించడంతో బోర్లాడలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
