బైక్​ దొంగల అరెస్ట్.. 20 బైక్​ల రికవరీ

బైక్​ దొంగల అరెస్ట్.. 20 బైక్​ల రికవరీ

చొప్పదండి, వెలుగు: కరీంనగర్​లోని సీతారాంపూర్​లో ఉన్న వెంకట్ బజాజ్ షోరూంలో డెలివరీ బాయ్​గా పనిచేస్తూ షోరూం బైక్​లను దొంగిలించి, అమ్ముకుంటున్న ఆనందం శ్రీకాంత్, అతడికి సహకరించిన మరో యువకుడు కుక్కల శివకుమార్ ను చొప్పదండి పోలీసులు అరెస్ట్​చేశారు. వారి నుంచి రూ.20 లక్షల విలువైన 20 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్​రూరల్​ఏసీపీ టి.కర్ణాకర్​రావు మీడియాకు వివరాలు వెల్లడించారు.

చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామానికి చెందిన చిలుముల దిలీప్ ఓ టూవీలర్​ను కొనుగోలు చేయగా, అమ్మిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఏప్రిల్​19న చొప్పదండి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా షోరూమ్​నుంచి బైక్​లను అమ్ముకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. శనివారం చొప్పదండి బస్టాండ్ సమీపంలో కుక్కల శివకుమార్, ఆనందం శ్రీకాంత్​ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.