ఘట్కేసర్ లో నాకాబందీ..కానిస్టేబుల్ను ఢీకొట్టిన వాహనదారుడు

ఘట్కేసర్ లో నాకాబందీ..కానిస్టేబుల్ను ఢీకొట్టిన వాహనదారుడు

హైదరాబాద్‌ లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. చైన్‌ స్నాచింగ్‌ ఘటనలతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట్ చౌరస్తా వద్ద నాకాబంది నిర్వహించి బైక్ లను చెకింగ్ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్స్,హెల్మెట్స్ లేని వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటువైపు నుంచి వేగంగా వచ్చిన ఓ వాహనదారుడు బైక్ ను ఆపకుండా వేగంగా డ్రైవ్ చేశాడు. వాహనదారుడిని ఆపేందుకు ప్రయత్నించిన నాగరాజు అనే కానిస్టేబుల్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయినా ఆగకుండా కానిస్టేబుల్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ నాగరాజుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని  కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్ల తెలుస్తోంది. 

కానిస్టేబుల్ నాగరాజును ఢీకొట్టి వెళ్లిన వాహనదారుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాకాబందీ నిర్వహించే సమయంలో వాహనదారులు తమకు సహకరించాలని సూచిస్తున్నారు. ఇటీవల నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గొలుసు తెంపుడుగాళ్లను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనుమానితులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.